వరంగల్ నగరంలో ఆదివారం ఉదయం నుండి ఎండ దంచికొట్టింది. ఉన్నట్టుండి సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఒక్కసారిగా వర్షం ప్రారంభమై సుమారు అరగంటపాటు కురవడంతో వివిధ పనులపై బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. వరంగల్ చౌరస్తాలో డ్రైనేజి వాటర్ రోడ్డు మీదకు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు.