సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ గీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా వైద్యాధికారిని లలితా దేవి ఆదేశాల మేరకు హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరవ డివిజన్ కిషన్ పురలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.