వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని పేకాట స్థావరాలపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు చేశారు. ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి రూ. 11, 140 లను, 3 సెల్ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.