వరంగల్ ఇసుక అడ్డ ప్రాంతంలో ప్రధాన పైపైన్ లీకేజీ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రామోజు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శివనగర్, ఆర్ ఎస్ నగర్, ఎంఎస్ నగర్, చింతల్, మిల్స్కలనీ, శాక రాశికుంట ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.