కాపురానికి రావడం లేదని భార్యను, అడ్డువచ్చిన అత్తా మామపై విక్షణారహితంగా దాడి చేసిన కోట చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసినట్లు ఆదివారం వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. పెయింటింగ్, రాడ్ వైండింగ్ పనులు చేస్తూ శంబునిపేట ఎస్సీకాలనీలో ఉంటు న్నాడు. 2022లో పల్లవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాపురానికి రావడం లేదని, మరో వ్యక్తితో చనువుగా ఉంటున్నదనే అనుమానంతో భార్యపై, అడ్డుకోబోయిన మామ, అత్తపై దాడి చేసి పరారయ్యాడు.