బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం

84பார்த்தது
బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను నియమించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ స్టేషన్ ఘనపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య రవిశంకర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వచ్చిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி