ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపి విభాగంతో పాటు వైద్యులు, సిబ్బంది గురించి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్, టీకా గది, పేషంట్స్ వార్డ్, ఆరోగ్య కేంద్రంను పరిశీలించారు.