ప్రశాంత వాతావరణంలో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల, మండల సమన్వయ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు లేనందున గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.