మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర నూతన పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఫిర్యాదు దారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రుర్ డిఎస్పీ కృష్ణ కిషోర్, తొర్రుర్ సీఐ జగదీష్, పెద్దవంగర ఎస్. ఐ క్రాంతి కిరణ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.