పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం గ్రామంలో గ్రామ కార్యదర్శి గంట శ్రీనివాస ఆధ్వర్యంలో కారోబార్ ఎన్. యాకన్న సహాయంతో బుధవారం స్వచ్ఛత హి సేవ ముగింపు గ్రామ సభ నిర్వహించారు. గత నెల 17 నుండి గాంధీ జయంతి వరకు జరిగిన కార్యక్రమాలన్నీ వివరిస్తూ ప్రతి కుటుంబం పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంటే ఊరంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ సభలో అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్, సీఏ, ఎఫ్ ఏ ప్రజలు పాల్గొన్నారు.