మాజీ సర్పంచులు, గిరిజన నాయకుల అక్రమ అరెస్టులు గర్హణీయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గిరిజన విద్యార్థులు, మాజీ సర్పంచులను, బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి వేళ అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విజయోత్సవ సభలను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.