వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రికి అనారోగ్య సమస్యలతో వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, సెల్ నెంబర్ తీసుకోని రావాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ మంగళవారం తెలిపారు. వైద్యులు పరీక్షించి మూత్ర, రక్త పరీక్షలుతోపాటు ఇతర పరీక్ష లు చేసినప్పుడు ఆధార్ కార్డు , మొబైల్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుందని టెస్టు రిపోర్టుల వివరాలు సెల్ నంబర్ కు మెసేజ్ ద్వారా వస్తాయన్నారు.