వరంగల్ జిల్లా ఖానాపురం మండల బీజేపీ అధ్యక్షుడు ఆబోతు రాజు యాదవ్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఖానాపురం మండలం గొల్లగూడెం తండా నుండి 25 మంది బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలోకి చేరారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత కల్పించి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.