జంగాలపల్లి: నాటువైద్యాన్ని నమ్మొద్దు : జిల్లా వైద్యాధికారి
ప్రజలు నాటు వైద్యం నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని జిల్లా వైద్యాధికారి గోపాలరావు అన్నారు. గత మూడు రోజుల నుండి జంగాలపల్లిలో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాన్ని నిమ్స్ ఆస్పత్రి వైద్య బృందం సందర్శించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ.. అవసరాన్ని మించి పెయిన్ కిల్లర్లు వాడవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు ఏ చిన్న అనారోగ్యం పాలైన అందరూ పిహెచ్ సి దవాఖానను సంప్రదించాలని కోరారు.