గడ్డిమందు తాగి యువకుడు ఆత్మహత్య
క్షణికావేశంలో ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం. జగజంపుల రాజేందర్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఇంట్లో చిన్నపాటి గొడవ కారణంగా గడ్డిమందు తాగాడు. కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు.