ములుగు మండలం జంగాలపల్లిలో అన్ని మరణాలు సహజ మరణాలేనని, దయ్యాలు భూతాలు అని ప్రజలు నమ్మవద్దని డిఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు అన్నారు. ములుగు డిఎంహెచ్ఓ గోపాల్ రావు ఆధ్వర్యంలో వైద్యబృందం జంగాలపల్లిలో వీధివీధి తిరుగుతూ కొంత కాలంగా సంభవిస్తున్న మరణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. గ్రామంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంప్‌ను ఉపయోగించుకోవాలన్నారు.