ఇంట్లోని ఫ్రిజ్‌ను ఖాళీ చేసి తడిగుడ్డతో శుభ్రపరుస్తున్న మహిళకు ఒక్కసారిగా షాక్ కొట్టి కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లో ఉండే ఫ్యాన్, లైట్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రికల్ పరికరాలను శుభ్రపరిచేటప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి, అన్‌ప్లగ్ చేసి శుభ్రం చేయాలి. ఎందుకంటే వాటిల్లో ప్రవహించే విద్యుత్ వల్ల ఎప్పుడైనా కరెంటు షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.