వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న ప్రజా పాలన విజయోత్సవ సభకు ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలానికి చెందిన డ్వాక్రా మహిళలు భారీగా తరలి వెళ్లారు. కొత్తగూడ మండలం నుంచి మంగళవారం 6 ప్రత్యేక బస్సులలో 278 మంది మహిళా సంఘాల సభ్యులు తరలి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమాదేవి, ఎస్సై కుషకుమార్, ఐకేపి ఏపీఎం శ్రీనివాస్ తదితరులున్నారు.