ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం. లక్ష్మీపురం గ్రామానికి చెందిన రామ్మూర్తి గురువారం మధ్యాహ్నం కృష్ణయ్య, ధర్మ రాజు అనే వ్యక్తులతో కలిసి గ్రామ శివారులోని చెరువులో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతై మృతి చెందాడు. కొడుకు మహేశ్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.