ములుగు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వనదేవతలైన మేడారం సమ్మక్క - సారలమ్మల చిత్రపటాన్ని గవర్నర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.