ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ వన దేవతలను అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మనవడు శ్రీహన్షు మురళీకృష్ణ పటేల్, కొండా మురళిలకు తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. రానున్న రోజుల్లో మేడారాన్ని అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంతో జాతీయ హోదా కల్పించలేకపోయామన్నారు.