ములుగు జిల్లా బిజెపి సంస్థాగత రిటర్నింగ్ అధికారిగా ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. విజయ చందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ములుగు జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు బిజెపి అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. బిజెపి పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి నుండి కష్టపడి పార్టీ బలోపేతానికి సహకరిస్తానని అన్నారు.