ములుగు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు తయారి పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మంగళవారం జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అమాయక రైతులను మోసం చేస్తున్న వారి పై క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి సీతక్క హెచ్చరించారు.