ఏటూరునాగారంలో దంచికొట్టిన భారీ వర్షం

1512பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ఈదురు గాలులు వీస్తుండడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన వడ్లు సైతం తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షాలతో వరి, మిర్చి, ఇతర పంటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி