ఏటూరునాగారం: ప్రయాణికులను ఆకట్టుకుంటున్న వృక్షాలు

66பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై గతంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వాగత తోరణాల వలె ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తెల్లవారుజామున మంచు, చుట్టుపక్కల పచ్చని పొలాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. కాగా, పొలాల్లోకి వచ్చే రైతులు, కూలీలు ఈ చెట్ల కింద నిత్యం సేద తీరుతుంటారు.

தொடர்புடைய செய்தி