ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బుటారంలోని అంగన్వాడి కేంద్రానికి మంగళవారం స్థానికులు తాళం వేశారు. నిబంధనకు విరుద్ధంగా వేరే గ్రామానికి చెందిన మహిళకు అంగన్వాడి టీచర్ పోస్టు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. గ్రామ మహిళలకు మాత్రమే అంగన్వాడి టీచర్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీచర్ నీ , పిల్లల్ని బయటికి పంపి అంగన్వాడి కేంద్రం తాళం వేయడంతో పిల్లలు బయట వేచి చూస్తున్నారు.