ములుగు జిల్లా కేంద్రంలోని నిరుపేదలైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రజా సంఘాల జేఏసి చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్ శుక్రవారం మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ముంజాల బిక్షపతి మాట్లాడుతూ మంత్రి సీతక్క అర్హులైన పేదవారికి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో దసరా తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి తెలిపారని పేర్కొన్నారు.