మహబూబాబాద్ జిల్లాలో ఉన్న మీ సేవ కేంద్రాలు సోమవారం తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు మీసేవా కేంద్రాల జిల్లా అధ్యక్షుడు దేశబోయిన అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మీసేవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. తిరిగి మంగళవారం యథావిధిగా మీసేవ కేంద్రాలు కొనసాగుతాయని వెల్లడించారు.