మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లి రేకుల తండాలో మంగళవారం హరితహారం కార్యక్రమం కిందా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తండా యూత్ అధ్యక్షుడు యాకూబ్ నాయక్ పలువురికి మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విధిగా 5 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హరి సైదులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.