జనగామ ప్రాంతం జిల్లాగా ఏర్పడి 8 ఏళ్లు పూర్తి చేసుకొని శుక్రవారంతో 9వ వసంతంలోకి అడుగు పెట్టింది. రెండేళ్ల పోరాటం తర్వాత జిల్లా ఏర్పడింది. మొత్తం 12 మండలాలతో ఏర్పడి అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాలను కల్పించుకుంటూ అభివృద్ధి పథంలో వెళ్తాంది. ఈ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.