జనగామ జిల్లాలో నిబంధనలు పాటించని బెల్ట్, బ్రాందీ షాపుల అనుమతులను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి కలెక్టర్ రిజ్వాన్ పాషాకి మంగళవారం మెమోరాండంని అందజేశారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో బెల్ట్ షాపుల ద్వారా ఏరులై పారుతున్న మద్యాన్ని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, ప్రజలు ప్రశాంతమైన జీవనం కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మధ్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని వారు తెలిపారు.