జనగామ పట్టణ కేంద్రంలో 23 వ వార్డు బీరప్ప గుడి ఏరియాలో 30 మేకలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని బాధితుడు
కెమిడి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దొంగిలించబడిన మేకలలో పిల్ల తల్లుల మేకలు కూడా ఉన్నాయని, పిల్లలను విడిచి పెట్టి మేకలను ఎత్తుకెళ్లారని, ఎత్తుకెళ్లిన మేకల మంద విలువ నాలుగు లక్షల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తనకు తగిన న్యాయం చేయాలని కోరారు.