డోర్నకల్ మండలం గొల్లచెర్లలో సురోబోయిన రాములమ్మ అనే వృద్ధురాలు తినడానికి తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. విషయం తెలిసిన డోర్నకల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎస్సై వంశీధర్ సోమవారం ఆమె స్వగృహానికి వెళ్లి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పండ్లను, కూరగాయలను, బట్టలను ఇచ్చి, ఆమె వైద్య ఖర్చులు కోసం కొంత డబ్బును ఆమెకు అందజేశారు. వృద్ధురాలికి డోర్నకల్ పోలీసులు చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు.