శివరాత్రి పండుగ సందర్బంగా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలోని శివాలయంలో శివ-పార్వతుల విగ్రహానికి జలాభిషేకాలను, పాలాభిషేకాలను నిర్వహించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే డోర్నకల్ మండలంలోని పంచముఖ లింగేశ్వరస్వామి ఆలయంలో శివ లింగానికి జలాభిషేకాలను పాలాభిశేకాలను నిర్వహించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. దీనితో భక్తులు దర్శనానికి క్యూ కట్టారు. ముస్తాబైన ఆలయాల్లో భక్తులు సందడి చేశారు.