భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంగళవారం మంత్రులు జూపల్లి, సీతక్క పర్యటించారు. గణపురంలోని ఘనప సముద్రం పరిశీలించి, కోటగులను సందర్శించిన అనంతరం గణపేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. టూరిజం అంటే కొన్ని పట్టణాల్లోనే చూస్తామని, మన ప్రాంతాలలో కూడా చారిత్రక కట్టడాలు ఉన్నాయని, అటవీ ప్రాంతంలో పాండవుల గుట్టలో పాండవులు వనవాసం చేశారన్నారు.