సర్వే సిబ్బందికి సహకరించాలని.. తప్పుడు సమాచారం ఇవ్వొద్దని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం గణపురం మండలంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ సర్వే ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేశారు. ఏ ఒక్క కుటుంబాన్ని వదల కుండా వివరాలు సేకరణ చేయాలని సూచించారు. కుటుంబ వివరాలు చెబితే ఏదో జరుగుతుందనే అపోహ వద్దని వివరాలు గోప్యతగా ఉంచుతామని అన్నారు.