పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన ఘటన మహమ్మదాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మంగళవారం జూలపల్లి గ్రామానికి చెందిన శిరీష(23)ను ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఈఎంటీ లక్ష్మీనారాయణ, పైలట్ అక్బర్ అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశారు. శిరీష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.