బొంరాస్ పేట: మానసిక అంగవైకల్యం, బుద్ధి మాంద్యం తదితర రుగ్మతలు ఉన్న చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బొంరాస్ పేట మండల కేంద్రంలో ఆకార్, ఆశా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జిల్లా డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ వో రవీందర్ యాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.