వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం ఏర్పుమళ్ళ గ్రామంలో కొనసాగుతున్న కుల గణన ఇంటింటి సర్వేలో భాగంగా స్టికర్లు వేసే కార్యక్రమాన్ని బుధవారం ఎంపీడీఓ వెంకన్న గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సర్వేను పక్కడ్బందీగా నిర్వహించాలని ఎన్యుమరేటర్లను ఆదేశించారు. ఈ కార్యాలయంలో అధ్యక్షులు జయకృష్ణ, నాయకులు వెంకట్ రాములు గౌడ్, కార్యదర్శి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.