TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్‌లోని సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను మాజీ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. హాస్టల్లో మెను పాటిస్తున్నారా, సరైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.