TG: ఆఫీస్‌లో తనతో పనిచేసే అమ్మాయికి అసభ్య వీడియోలు పంపాడని నాగరాజు అనే యువకుడిని అమ్మాయి బంధువులు ఇంటికొచ్చి చితకబాదారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ పరిధి మీర్పేట్‌లోని జిల్లేలగూడలో జరిగింది. ఆ తర్వాత అతడిని కొట్టుకుంటూ వేరే చోటకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమ కొడుకు కనిపించడం లేదంటూ నాగరాజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.