భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (73) కోలుకుంటున్నారు. ఛాతీనొప్పి, అసౌకర్యానికి గురికావడంతో ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు చేరుకుని ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే.