'దేవర’ సినిమాకు పని చేసిన వారిన కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోనని ఎన్టీఆర్ అన్నారు. ఆ చిత్రం అందరికీ ప్రత్యేకమేనని పేర్కొన్నారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. చెన్నై నాకెంతో ప్రత్యేకం.. బాల్యంలో కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నాను. "వెట్రిమారన్ సర్.. తమిళ్లోనైనా నాతో ఒక సినిమా చేయండి. మేం దాన్ని తెలుగులో డబ్ చేసుకుంటాం’’ అని దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు ఎన్టీఆర్.