ఫ్లోరిడాలోని మియామిలో ఆదివారం నిర్వహించిన UFCలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందడి చేశారు. అభిమానులు ట్రంప్ క్యాప్‌లు ధరించి.. ఆయనకు ఘన స్వాగతం పలకడంతో ట్రంప్ తన స్టైల్లో అభిమానులతో కలిసి కాలు కదిపారు. ఆయనతో పాటు ఎలాన్ మస్క్, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసీ గబ్బార్డ్, ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ తదితరులు సందడి చేశారు. కాగా డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.