వారంతా చిన్నా, చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే బడుగుజీవులు. రెక్కాడితే డొక్కాడని వీధి వ్యాపారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద వందల సంఖ్యలో పుట్ పాత్ వెండర్స్ సామగ్రిని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. వారు వేసుకున్న టెంట్లను తొలగించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ సామగ్రిని తీసుకువెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు.