తెలంగాణ SC, ST, BC, మైనార్టీ, సంక్షేమ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రూ. 3 వేల కోట్ల బడ్జెట్‌తో SC, STలకు స్వయం ఉపాధి పథకాలను 2 నెలల్లో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.