దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయం..ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందని కేటీఆర్ చురకలు అంటించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం అని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు.