మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యపై ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ హత్యతో మహారాష్ట్ర మాత్రమే కాదు దేశం మొత్తం భయపడుతోందన్నారు. ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. గ్యాంగ్‌స్టర్ పాలన తీసుకురావాలనుకునే వారికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.