తాను రూ.3 లక్షలకు పైగా విలువైన క్రెడ్ జాక్‌పాట్‌ను స్కోర్ చేశానని, కానీ ఆ కంపెనీ జాక్‌పాట్‌ను రద్దు చేసిందని అవిరల్ సంగల్ అనే క్రెడ్ కస్టమర్ ఎక్స్ లో పేర్కొన్నాడు. "ఏదో సాంకేతిక సమస్య వల్ల జాక్ పాట్ రద్దు చేయాల్సి వచ్చిందని క్రెడ్ బృందం నుంచి కాల్ వచ్చింది" అని సంగల్ చెప్పారు. "వారు పాయింట్లను రీఫండ్ చేస్తున్నారు. అలాగే వారు రూ.1,000 కాష్ బ్యాక్ ఇవ్వబోగా నేను తిరస్కరించాను" అని అన్నారు.