చైనా కంపెనీ బీవైడీ (BYD) ఇటీవల CES 2025లో యాంగ్‌వాంగ్ యూ9 (Yangwang U9) అనే ఒక అదిరిపోయే సూపర్ కారును ఆవిష్కరించింది. తాజాగా ఈ కారుకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసింది. ఈ కారుకు ‘జంపింగ్ సస్పెన్షన్’ ఉండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. దీని స్పెషలిటీ ఏంటంటే.. రోడ్డుపై ఉన్న గుంతల నుంచి రైడర్‌కు ఉపశమనం కలిగించేందుకు ఇది 6 మీటర్ల వరకూ జంప్ చేయగలదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.